Breaking News

సెట్స్‌లోనే నో చెప్పండి

Published on Wed, 06/10/2026 - 04:06

సినిమాల్లో మహిళల పాత్రలను వెండితెరపై చూపించే విధానంపై సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పోషించిన పా త్రను సిల్వర్‌ స్క్రీన్‌పై దర్శకుడు బుచ్చిబాబు కాస్త అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో ఇంకా హాట్‌ టాపిక్‌గానే ఉంది. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి జయా బచ్చన్‌ వెండితెరపై కథానాయికలను చూపించే విధానంపై స్పందించారు.

సినిమాల్లో మహిళల పా త్రలను కేవలం గ్లామర్‌ కోణంలోనే చూపించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశం గురించి ఓ ఆంగ్ల మీడియాతో జయా బచ్చన్‌  మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు తమకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సెట్స్‌లోనే స్పందించాలి... తిరగబడాలి. ఫలానా సన్నివేశం చేయడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పాలి’’ అని పేర్కొన్నారు. హిందీ చిత్రం ‘షోర్‌’ చిత్రీకరణలో భాగంగా ఆ చిత్రదర్శకుడు (మనోజ్‌కుమార్‌) జయా బచ్చన్‌ను గాగ్రా చోళీలోనే సినిమా అంతా కనిపించాలని చెప్పారట. అయితే దుపట్టా ధరిస్తానని ఆ దర్శకుడితో జయా బచ్చన్‌ అన్నారట.

ఈ విషయమై జయా బచ్చన్‌కు, ఆ దర్శకుడికి పెద్ద గొడవ జరిగిందట.  ఆ తర్వాత ఓ సన్నివేశం ఇబ్బందికరంగా అనిపించడంతో నటించనని జయా బచ్చన్‌ తేల్చి చెప్పారట. ‘‘నా కెరీర్‌లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. ఆ తర్వాత సెట్స్‌లో నాతో హద్దులు దాటి ప్రవర్తించేందుకు, సినిమాలో ఎలా పడితే అలా చూపించేందుకు ఎవరూ సాహసించలేదు. అలాగే ఆ దర్శకుడితో నేను మళ్లీ కలిసి పని చేయలేదు’’ అని పేర్కొన్నారు జయా బచ్చన్‌.

అందుకు మా అత్తగారు ఓ ఉదాహరణ: కరీనా కపూర్‌ 
జయా బచ్చన్‌ మాటలకు మద్దతు ఇస్తూ కరీనా పూర్‌ తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ‘‘కభీ ఖుషీ కభీ గమ్‌’ చిత్రంలోని ‘సూరజ్‌ హువా..’ పా టలో కాజోల్‌గారిని లేదా ‘చాందినీ’ సినిమాలోని ‘తేరే మేరే..’ పా టలో శ్రీదేవిగారిని చూడండి. సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి స్కిన్‌ షో చేయకుండానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. అలాగే ‘ఆరాధన’ చిత్రంలో ‘రూప్‌ తెరా మస్తానా’ పా టలో మా అత్తగారు (షర్మిలా ఠాగూర్‌) నిండైన వస్త్రధారణతో కనిపిస్తారు.

అయినప్పటికీ వెండితెరపై అందంగా కనిపించారు. తక్కువ దుస్తులతో కాకుండా హుందాగా కనిపించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చనడానికి ఆమె ఓ ఉదాహరణ. తెరపై ఆకర్షణీయంగా కనిపించడం అంటే ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం కాదు.. నిండైన వస్త్రధారణలోనూ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అలాగే  హీరోయిన్‌ను కేవలం ఒక వస్తువులా చూపించడం సరికాదని నా అభిప్రాయం’’ అని కరీనా కపూర్‌ పేర్కొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)