Breaking News

మాధురి దీక్షిత్‌పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్

Published on Tue, 03/28/2023 - 19:09

అమెరికన్ సిట్‌ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్‌  షోలో మాధురి దీక్షిత్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు.  

ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్‌  ఐశ్యర్యారాయ్‌తో పోలుస్తూ మాధురీ దీక్షిత్‌ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్‌ వ్యాఖ్యల పట్ల  జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. 

ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్‌ను పోలుస్తూ కునాల్ నయ్యర్‌ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్‌కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ'  భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్‌ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. 

నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు

అయితే ఈ ఎపిసోడ్‌ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్  స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌పై  కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని..  పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు.

బిగ్ బ్యాంగ్ థియరీ

'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్‌కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)