నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి

Published on Fri, 09/12/2025 - 12:24

ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా పర్వీన్‌ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్‌ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్‌ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.

చర్మం ఊడివచ్చేలా..
జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్‌ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్‌ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్‌ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

అందవిహీనంగా మారిపోయా
శారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్‌ లైప్‌ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.

సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..
అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్‌ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్‌ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్‌.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్‌ పాత్రలు పోషించింది.

చదవండి: రైలు నుంచి దూకేసిన బాలీవుడ్‌ హీరోయిన్‌

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)