Breaking News

బాధితురాలిపై జానీ మాస్టర్‌ భార్య చౌకబారు వ్యాఖ్యలు

Published on Thu, 09/19/2024 - 20:56

లైంగిక వేధింపుల వ్యవహారం, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్‌ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్‌ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 

కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్‌
అయితే హీరోయిన్‌ అవ్వాలి, లేదంటే టాప్‌​ కొరియోగ్రాఫర్‌ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందంటున్నారు.. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవడి దగ్గరకు వెళ్లలేదని గ్యారెంటీ ఏంటి? తనకు చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్‌ ఉన్నాయి. మహిళ అనే పదానికే ఆమె కళంకం అని బాధితురాలి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది.

జానీపై కేసు
అవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే, సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్‌ తనను లైంగికంగా, మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. 

నిప్పు లేనిదే పొగ రాదు
నిజంగానే అతడు ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్నిరోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవాల్సిన గత్యంతరం ఏంటి? ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది కానీ తానే ఒప్పని చూపించుకోవడం కోసం బాధితురాలిపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్‌ ఉన్నాయని, ఎంతోమందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగ రాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చదవండి:  సోనియా దిగజారుడు ప్రవర్తన.. ఛీ కొడుతున్న జనం

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)