Breaking News

ముగిసిన జానీ మాస్టర్‌ కస్టడీ.. మళ్లీ జైలుకు తరలింపు

Published on Sat, 09/28/2024 - 15:42

లైంగిక ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ముగిసింది.  నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు. ఈనెల 25వ తేదీ నుంచి  జానీ మాస్టర్‌ను నార్సింగ్‌ పోలీసులు విచారించారు. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, జానీ మాస్టర్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు.

పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను నార్సింగ్‌ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి..?  ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది..? ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్‌ ముందు ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో నాలుగు రోజులపాటు అతడిని విచారించిన నార్సింగి పోలీసులు.. 

అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్‌ తనపై లైంగిక దాడి చేశారని అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను మైనర్‌గా ఉన్నప్పడే ఈ ఘాతుకానికి జానీ పాల్పడినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది.  అక్టోబర్‌ 3న జానీ మాస్టర్‌ రిమాండ్‌ గడువు ముగుస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)