Breaking News

కోర్టులో జానీ మాస్టర్‌కు చుక్కెదురు

Published on Mon, 10/14/2024 - 17:59

లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్‌  కొరియోగ్రాఫర్  జానీ మాస్టర్‌ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.  కోర్టు ఆదేశాల మేరకు కొద్దిరోజుల క్రితం జానీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే,  ఈ క్రమంలో  బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో జానీ ఒక పిటీషన్‌ పెట్టుకున్నారు. తాజాగా న్యాయస్థానంలో తన బెయిల్‌పై విచారణ పూర్తి అయింది.

ఇప్పటికే పలుమార్లు జానీ బెయిల్‌ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. కానీ, నేడు (అక్టోబర్ 14) జానీ  బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది.   కేసు విచారణ పూర్తి అయిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.  బెయిల్‌ వస్తుందని ఆశలు పెట్టుకున్న జానీకి కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఆయన ఉన్నారు.

జానీ మాస్టర్‌ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్‌ 15న నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ భయపెట్టాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం  యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో  పోక్సో కేసుగా నమోదు చేశారు.
 జానీ మాస్టర్‌కు భారీ షాక్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)