Breaking News

ప్రియుడిపై జాన్వీ కపూర్ ప్రేమ.. ఏకంగా మెహందీలో కూడా..!

Published on Thu, 07/09/2026 - 18:38

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇటీవలే పెద్ది మూవీ సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రతో అభిమానులను ఆకట్టుకుంది.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ ఇటీవలే బోనీ కపూర్‌ మొదటి భార్య కూతురైన అన్షులా కపూర్ పెళ్లిలో సందడి చేసింది. తన సిస్టర్ ఖుషీ కపూర్‌తో కలిసి ఈ వేడుకకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

వరుసకు తన సోదరి అయిన అన్షులా కపూర్ వివాహ రిసెప్షన్‌లో జాన్వీ కపూర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వేసుకున్న మెహందీలో తన ప్రియుడైన శిఖర్ పహారియాను పేరును రాసుకుంది. ఆమె ముద్దుగా పిలిచే శికు అంటూ మెహందీలో రాసుకొచ్చింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇది కాస్తా వైరల్‌ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

శిఖర్ పహారియాతో డేటింగ్..

కాగా.. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా చాలా ఏళ్లుగా ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరూ 2016లో డేటింగ్ ప్రారంభించి.. 2018లో జాన్వీ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 2023లో వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మళ్లీ డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా జాన్వీతోనే శిఖర్ కనిపిస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి.  ఈ ఏడాది ప్రారంభంలో జాన్వీ, శిఖర్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఖండించారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)