Breaking News

'పుష్ప2'కు సపోర్ట్‌గా జాన్వీకపూర్‌.. అభిమానుల నుంచి ప్రశంసలు

Published on Sat, 12/07/2024 - 10:33

అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో పుష్ప2తో మరో హిట్‌ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానల నుంచి పుష్పరాజ్‌కు ఫిదా అవుతున్నారు. సుమారు 12500కు పైగా థియేటర్స్‌లలో విడుదలైన ఈ చిత్రం పట్ల బాలీవుడ్‌లో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎక్కువ థియేటర్స్‌ పుష్ప2 చిత్రానికి కేటాయించడంతో వారు అభ్యంతరం తెలుపుతున్నారు. పుష్ప2 వల్ల హాలీవుడ్‌ హిట్ మూవీ 'ఇంటర్‌ స్టెల్లార్‌' రీ రిలీజ్‌ వాయిదా పడిందని పుష్పను విమర్శిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ రియాక్ట్‌ అయ్యారు.

2014లో విడుదలైన'ఇంటర్‌ స్టెల్లార్‌' సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికి విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్బంగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అయితే, బాలీవుడ్‌లోని ఐమాక్స్‌లలో ఎక్కువ చోట్ల పుష్ప2 ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో కొందరు నెట్టింట అభ్యంతరం పెడుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై జాన్వీ స్పందించింది.

పుష్ప2 చిత్రాన్ని సమర్థిస్తూ జాన్వి ఇలా చెప్పుకొచ్చింది. 'పుష్ప2 కూడా సినిమానే కదా.. పాశ్చాత్య దేశాలకు చెందిన సినిమాలతో పోలుస్తూ మన సినిమాను ఎందుకు తక్కువ చేస్తున్నారు. మన సినిమాలను గుర్తించకుండా ఇతర దేశ సినిమాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం మీరు సపోర్ట్‌ చేస్తున్న  హాలీవుడ్‌ వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇక్కడ విచారకరం ఏమిటంటే.. మనం మాత్రమే మన సినిమాలపై చిన్న చూపు చూపిస్తున్నాం.' అంటూ పుష్ప2 చిత్రానికి సపోర్ట్‌గా ఆమె కామెంట్‌ చేశారు. ఈ విషయంలో జాన్వీపై ప్రశంసలు అందుతున్నాయి.

బాలీవుడ్‌లో శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌.. తెలుగులో 'దేవర'తో పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ కొట్టడంతో ఆమెకు కూడా మంచి గుర్తింపు దక్కింది. రామ్‌చరణ్‌- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఒక చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)