Breaking News

ఆ యాంగిల్‌లో తీయొద్దని చెప్పా: జాన్వీ కపూర్

Published on Wed, 07/24/2024 - 15:42

బాలీవుడ్ బ్యూటీ, దేవర భామ జాన్వీకపూర్‌ ప్రస్తుతం ఉలజ్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే మిస్టర్ అండ్‌ మిసెస్ మాహీతో అలరించిన ముద్దుగుమ్మ మరో డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో యువ దౌత్యవేత్తగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. ఈ మూవీకి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్‌ తాను చెప్పిన విషయాన్ని గుర్తు ఉంచుకుని పాటిస్తున్నారని జాన్వీ వివరించింది.

గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్‌ సైడ్‌ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ క్యాప్షన్‌లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్‌లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది.

కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్‌తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదల కానుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)