Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీకి జాన్వీ అన్ని కోట్లు డిమాండ్‌ చేసిందా?

Published on Thu, 03/09/2023 - 14:19

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసిందే. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఇదివరకే విడుదల చేశాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ సినిమాలో నటించేందుకు జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వీ రూ. 5 కోట్లు చార్జ్‌ చేస్తుందట.

వాస్తవానికి బాలీవుడ్‌ సినిమాల్లో నటించడానికి జాన్వీ రూ. 3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకునేది. కానీ తెలుగులో లాంచ్‌ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. తొలి సినిమాకే  ఇంత మొత్తం తీసుకుంటుండడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కాగా 'ప్రాజెక్టు K' మూవీ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటోందట. ఆమె తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)