Breaking News

ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్‌!

Published on Sat, 05/25/2024 - 12:10

బాలీవుడ్‌ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్‌ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్‌ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్‌చరణ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. 

ఇద్దరూ ఒకే సినిమాలో!
ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌కు జంటగా గేమ్‌ చేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్‌గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. 

ద్విపాత్రాభినయం
శింబు ప్రస్తుతం కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న థగ్‌లైఫ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించనుంది.  దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.

కియారాతో పాటు..
శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్‌ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్‌ ఇద్దరూ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!

చదవండి: ట్రెండింగ్‌లో విజయ్‌ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)