Breaking News

ఏడాది కష్టపడ్డా.. 'జన నాయగన్'లో నా సీన్ తీసేశారు

Published on Fri, 07/24/2026 - 11:49

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ తెలుగులో డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఏడాది పాటు పనిచేశానని, కానీ తన సీన్ కట్ చేసి పడేశారని ఓ తమిళ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి తన బాధని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ‍'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

'ఈ సినిమా కోసం నేను ఏడాది పాటు పనిచేశాను. విజయ్ సర్‌తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. 'జన నాయగన్' విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. ఆయనతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది' అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆనంది.. స్వతహాగా సీరియల్ నటి. తమిళంలో 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుం కాలంగళ్', 'కల్లికట్టు పళ్లికూడం' తదితర సీరియల్స్‌లో నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. 'డాన్స్ జోడీ డాన్స్ 3.0', 'జోడి నెం.1' సీజన్ 6, 7, 'మానాడా మయిలాడా' సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ టైంలో అయితే సూర్య 'కరుప్పు', గట్టకుస్తీ 2 చితాల్లో కనిపించింది.

ఈ సినిమాల హీరోయిన్ పూజా హెగ్డే సీన్సే చాలావరకు తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు హెచ్.వినోద్ చెప్పాడు. అలాంటిది ఆనందిత బాధపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈమెని సపోర్ట్ చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 'జన నాయ‍గన్' మూవీకి తొలిరోజు రూ.78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెలుగులో వచ్చిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి ఈ చిత్రం రీమేక్ ఇది.

(ఇదీ చదవండి: ‘జన నాయకుడు’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)