Breaking News

జేమ్స్‌ కామెరూన్‌ లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా

Published on Wed, 09/18/2024 - 05:50

హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అమెరికన్‌ ప్రముఖ రచయిత చార్లెస్‌ ఆర్‌. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’ బుక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్‌ కామెరూన్‌. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ్రపాణాలతో బతికి బయటపడ్డ జపాన్‌ ఇంజనీర్‌ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని హాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. 

చార్లెస్‌ రాసిన ‘ఘోస్ట్స్‌ ఆఫ్‌ హిరోషిమా’, ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్‌ కామెరూన్‌. ప్రస్తుతం ‘అవతార్‌’ ఫ్రాంచైజీతో జేమ్స్‌ కామెరూన్‌ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్‌ (2019), అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (అవతార్‌ 3)  చిత్రం 2025లో రిలీజ్‌ కానుంది. 

ఇంకా ‘అవతార్‌ 4, అవతార్‌ 5’ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి... ‘అవతార్‌’ ఫ్రాంచైజీని పక్కన పెట్టి జేమ్స్‌ కామెరూన్‌ ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ చేస్తారా? లేదా అనే అంశంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘అవతార్‌’ ఫ్రాంచైజీలకన్నా ముందే ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళితే 1997లో వచ్చిన ‘టైటానిక్‌’ తర్వాత జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించే నాన్‌ అవతార్‌ ఫిల్మ్‌ ‘లాస్ట్‌ ట్రైన్‌ ఫ్రమ్‌ హిరోషిమా’నే అవుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)