Breaking News

ఆ సీక్వెల్స్‌కి నేను డైరెక్షన్‌ చేయకపోవచ్చు! 

Published on Fri, 02/09/2024 - 00:39

హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అవతార్‌’. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పండోరా ప్రపంచంలో విహరించేలా చేసింది. కలెక్షన్స్‌లో సరికొత్త బాక్సాఫీస్‌ రికార్డులను సృష్టించింది. దీంతో ‘అవతార్‌’కు సీక్వెల్స్‌గా ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’లను ప్రకటించారు జేమ్స్‌ కామెరూన్‌. ‘అవతార్‌’ సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్‌ 2: ద వే ఆఫ్‌ వాటర్‌’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’ సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరుగుతున్నాయి. ‘అవతార్‌ 3’ ఈ ఏడాదిలో విడుదల కావాల్సింది. కానీ 2025కి వాయిదా వేశారు.

2025 డిసెంబరు 19న‘అవతార్‌ 3’, 2029లో ‘అవతార్‌ 4’, 2031లో ‘అవతార్‌ 5’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కాగా ‘అవతార్‌’ ఫ్రాంచైజీలో ‘అవతార్‌ 6’, ‘అవతార్‌ 7’లకు కూడా చాన్స్‌ ఉందని జేమ్స్‌ కామెరూన్‌ చెబుతున్నారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ‘అవతార్‌’ సినిమా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ– ‘‘అవతార్‌’ ఫ్రాంచైజీలోని ఐదు సినిమాలకు కథలు రెడీగా ఉన్నాయి. ‘అవతార్‌ 6’, ‘అవతార్‌ 7’ల గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ‘అవతార్‌ 6’, ‘అవతార్‌ 7’లకు నేను దర్శకత్వం వహించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు.

హలీవుడ్‌లో ‘టైటానిక్‌’, ‘ది టెర్మినేటర్‌’ వంటి అద్భుత చిత్రాలను కూడా తీసిన జేమ్స్‌ కామెరూన్‌ కెరీర్‌ను ‘అవతార్‌’ ఫ్రాంచైజీ ఒక్కటే డామినేట్‌ చేయడం ఆయన ఫ్యాన్స్‌కు రుచించడం లేదని హాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఇక కామెరూన్‌ అన్నట్లు భవిష్యత్‌లో ‘అవతార్‌ 6’, ‘అవతార్‌ 7’లు సెట్స్‌పైకి వెళితే.. కనీసం ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ఈ సినిమాలను తీయాల్సి ఉంటుందన్నట్లు హాలీవుడ్‌ సినీ విశ్లేషకులు అభి్రపాయపడుతున్నారట.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)