Breaking News

తెలంగాణ ఫోక్‌ సాంగ్‌కి మెగాస్టార్‌ మాస్‌ డ్యాన్స్‌

Published on Tue, 07/11/2023 - 17:08

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘జామ్‌ జామ్‌ జజ్జనక'ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ చిత్రంలోని రెండో పాట ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ నేడు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను ప్రముఖ సింగర్స్‌ అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

డ్యాన్స్‌తో ఇరగదీసిన మెగాస్టార్‌
ఈ మధ్యకాలంలో ఫోక్‌ సాంగ్స్‌కి టాలీవుడ్‌ స్టార్స్‌ స్టెప్పులేసి అలరిస్తున్నారు. ఆ మధ్య ధమాకా చిత్రంలో రవితేజ ‘పల్సర్‌ బైక్‌’కి అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఇక ట్రెండ్‌కి తగ్గట్టుగా వ్యవహరించే మెగాస్టార్‌ కూడా ట్రెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌ ‘నర్సపల్లె..’ పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మరోసారి డ్యాన్స్‌తో తనకు పోటీలేరని నిరూపించుకున్నాడు. 'జామ్‌ జామ్‌ జజ్జనక'సాంగ్‌ మధ్యలో ‘నర్సపెల్లే గండిలోన గంగధారి’పాటను యాడ్‌ చేశారు. దానికి చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. భోళా శంకర్ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం ఆధారంగా తెరకెక్కుతుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)