Breaking News

'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!

Published on Wed, 08/23/2023 - 15:05

సూపర్‪‌స్టార్ రజనీకాంత్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. దీంతో చాలామంది ఆయన పని అయిపోయిందనుకున్నారు. కానీ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన‍్ని బ్రేక్ చేశారు. తలైవా ఈజ్ బ్యాక్ అని అందరూ అనుకునేలా చేశారు. థియేటర్లలో ఇప్పటికీ ఎంటర్ టైన్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

'జైలర్'కి అది ప్లస్
'జైలర్' సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే రజనీ హిట్ కొట్టి చాన్నాళ్లయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. గత మూవీ 'బీస్ట్' సరిగా ఆడలేదు. అలా పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఆడియెన్స్ సినిమాకు వెళ్లారు. కానీ 'జైలర్' చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.

(ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్‌ వల్లే భోళా శంకర్‌ ఫ్లాప్‌.. ఆయనకు తెలుసు!: బేబి నిర్మాత)

ఆరోజు నుంచే?
రజనీకాంత్ చరిష్మా, అనిరుధ్ మ్యూజిక్ వల్ల 'జైలర్' బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కి చెందిన సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. హిందీ డబ్బింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో అదే రోజు రిలీజ్ కానుందని సమాచారం. దాదాపు ఇది కన్ఫర్మ్, త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

కలెక్షన్స్ ఎంత?
థియేటర్లలోకి వచ్చి 13 రోజులు పూర్తి చేసుకున్న 'జైలర్'.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలానే లాంగ్ రన్‌లో ఇది రూ.600 కోట్ల మార్క్ ని దాటేయొచ్చని అనిపిస్తుంది. ఫైనల్ గా ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి?

(ఇదీ చదవండి: నరేశ్‌-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్‌ నుంచీ ఇదే జరుగుతుంది!)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)