Breaking News

విషాదం.. ‘జైలర్‌’ నటుడు మృతి

Published on Fri, 09/08/2023 - 10:50

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్‌ జి మారి ముత్తు(57) మరణించాడు. గుండెపోటుతో ఆయన శుక్రవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెళ్లడించారు. దర్శకుడిగా, నటుడిగా కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు మారి ముత్తు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఇటీవల విడుదలైన జైలర్‌ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇందులో విలన్‌ నమ్మకస్తుడి పాత్రలో నటించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారి ముత్తు మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటి నుంచి పారిపోయి..
మారిముత్తుకు చిన్నతనం నుంచే సినిమాలపై ప్రేమ కలిగింది. ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడంతో 1990లో సొంతూరు పసుమలైతేరి నుంచి చెన్నైకి పారిపోయాడు. దర్శకుడు కావాలనే కోరికతో  గీత రచయిత వైరముత్తు దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్‌గా పనిచేశాడు. తరువాత నటుడు-దర్శకుడు రాజ్ కిరణ్‌లో సహాయ దర్శకునిగా చేరాడు.     మణిరత్నం, వసంత్, ఎస్‌ జే సూర్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాడు. 'మన్మధన్'సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ‘కన్నుమ్ కన్నుమ్’సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. తొలి సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఆ తర్వాత ‘పులివాల్‌’చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2014లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది. 

(చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్‌ గురించి తెలుసా?)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)