జైలర్‌ - 2లో నేనున్నా.. సీనియర్‌ హీరోయిన్‌

Published on Sun, 04/13/2025 - 06:50

పని చేసుకుంటూ పోతే వయసు గుర్తుకు రాదంటారు. అది రజనీకాంత్‌ విషయంలో అక్షరాల నిజం అవుతోంది. జైలర్‌ చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న రజినీకాంత్‌ ఆ తర్వాత వేట్టైయాన్‌ చిత్రం చేశారు. తాజాగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రం పూర్తి చేశారు. ఆ వెంటనే తాజాగా జైలర్‌ –2 చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కోయంబత్తూరులో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇటీవలే రజినీకాంత్‌ జైలర్‌– 2 చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్లారు. 

జైలర్‌ చిత్రంలో టైగర్‌ ముత్తు వేల్‌ పాండియన్‌గా నటించిన రజనీకాంత్‌ సీక్వెల్‌లోనూ అదే పాత్రలో నటిస్తున్నారు. అందులో ఆయనకు కూతురుగా నటించిన మలయాళ నటి మిర్ణా మోహన్‌ కూతురుగానే నటిస్తున్నారు. ఇకపోతే జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆయనకు జతగా నటిస్తున్నారు. దీని గురించి నటి రమ్యకృష్ణ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ జైలర్‌–2 చిత్ర షూటింగ్‌లో తాను గత 10వ తేదీ నుంచి పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే తేదీ తాను రజనీకాంత్‌ కలిసి నటించిన పడయప్ప చిత్రం 26 వసంతాలను పూర్తి చేసుకున్న రోజు అని పేర్కొన్నారు. 

జైలర్‌–2 చిత్రంలో మళ్లీ రజనీకాంత్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులోకి నటుడు యోగిబాబు, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కోయంబత్తూరు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఏకదాటిగా 35 రోజులు జరుపుకుంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభానికి ముందే ప్రోమో ను విడుదల చేసిన విషయం, అది రజనీకాంత్‌ అభిమానులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)