Breaking News

మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!

Published on Thu, 07/27/2023 - 15:10

బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు.  అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.   యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు.

(ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!)

ఈ నేపథ్యంలోనే  ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల‍్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది.  హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్‌ నుంచి  తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్‌ డీన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సోషల్‌ యాక్షన్‌ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్‌ చేశారు.

ఆష్విట్జ్‌ అంటే ఏంటి?
 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్‌ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్‌’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది.  మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్‌ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్‌లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్‌లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్‌ ప్రశ్నించారు.

(ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్‌.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)