Breaking News

రేవతి కుటుంబం కోసం వెళ్లాను.. జగపతి బాబు ఫస్ట్‌ రియాక్షన్‌

Published on Sun, 12/22/2024 - 17:28

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం గురించి పుష్ప2లో కీలకపాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్‌ అయ్యారు. తన సోషల్‌మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు.

'సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్‌ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను.  హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్‌ ఇద్దామని వెళ్లాను. అయితే, మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను.' అని జగపతి బాబు అన్నారు.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్‌ కుటుంబం నుంచి ఒక్కరు కూడా  ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్‌ చేశారు. కానీ, అల్లు అర్జున్‌ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒక్కరైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారా..?  అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?