Breaking News

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం చిరంజీవి, శ్రీదేవి రెమ్యునరేషన్‌

Published on Mon, 05/05/2025 - 18:21

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం గురించి పలు పాత విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత బడ్జెట్‌ అయింది..? చిరు, శ్రీదేవిల రెమ్యునరేషన్‌ ఎంత..? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.  35 ఏళ్ల తర్వాత ఈ మూవీని రీ–రిలీజ్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న 2డీతో పాటు 3డీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.. వంటి సెల్యులాయిడ్‌ వండర్‌ వెనక  చాలామంది ఛాంపియన్స్‌ ఉన్నారు.  ఇళయరాజా అందించి ట్యూన్స్‌, దర్శకుడు రాఘవేంద్ర రావు విజన్‌, డీఓపీ విన్సెంట్‌, అద్భుతమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్‌ డైరెక్టర్‌ చలం.. పాటలు, మాటలతో మెస్మరైజ్‌ చేసిన వేటూరి గారు, జంధ్యాల గారు  ఇలా ఎందరో ఈ సినిమాకు పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్‌ స్టోన్‌ , ఓ హిస్టారికల్‌ ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోసం రూ. 2 కోట్లు ఖర్చు అయిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి.

మే 9న రీ-రిలీజ​ కానున్న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాను మీరు చూస్తే రూ. 2 కోట్లతో ఇంతటి రిచ్‌ సినిమాను నిర్మించారా అంటూ ఆశ్చర్యపోతారు.  ఇప్పట్లో అయితే, ఈ ప్రాజెక్ట్‌ కోసం కనీసం రూ. 200 కోట్లు పైగానే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ సినిమా విడుదల సమయంలో భారీ వర్షాల వల్ల మొదటి వారం కలెక్షన్స్‌ పెద్దగా లేవు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ప్రింట్స్‌ పెరిగాయి. ఎక్కడ చూసిన కూడా థియేటర్స్‌ నిండిపోయాయి. అలా ఏకంగా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 15 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాకు గాను చిరంజీవి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)