Breaking News

ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?

Published on Thu, 05/01/2025 - 12:39

కొన్నేళ్లుగా బాలీవుడ్‌ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవీ పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్‌ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్‌ నిర్మాత, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani).

సగం కూడా వెనక్కు రాలేదా?
ఇతడు గతేడాది అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి 'బడే మియా చోటే మియా' సినిమా (Bade Miyan Chote Miyan) చేశాడు. ఇది దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్‌ వద్ద కనీసం బ్రేక్‌ ఈవెన్‌ కూడా అవలేదు. టోటల్‌ రన్‌లో కేవలం రూ.111.49 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ (Pooja Entertainment) సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్‌ను అమ్మేసి రూ.250 కోట్ల అప్పు తేర్చేసినట్లు ప్రచారం జరిగింది.

అనుమానమే నిజమైంది
తాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ భగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్‌తో సినిమా తీశాం కానీ కంటెంట్‌ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్‌ అవదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదుగా.

ఇప్పుడు చెప్పి ఏం లాభం?
ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడిదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. జాకీ భగ్నానీ.. కల్‌ కిస్నే దేఖా, రంగ్రేజ్‌, అజబ్‌ గజబ్‌ లవ్‌, వెల్‌కమ్‌ టు కరాచీ, మిత్రాన్‌ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెం.1, కట్‌పుత్లి, మిషన్‌ రాణిగంజ్‌, గణ్‌పథ్‌, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు.  హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)