Breaking News

ఏడాదిగా వెయిటింగ్‌.. ఎస్‌ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్‌

Published on Thu, 11/09/2023 - 13:50

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. అయితే ఆమె ఇప్పటికే తన పెళ్లి విషయంలో రెండుసార్లు ఫ్రాంక్‌ వీడియోలు చేసింది. కానీ మూడోసారి మాత్రం అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు సంతోష్‌తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్‌ చేసింది.

సంతోష్‌కు ఓకే చెప్పిన పవిత్ర
'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్‌.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని తన పోస్ట్‌కు ‍క్యాప్షన్‌ జోడించింది పవిత్ర.

ఏడాది నుంచి ఎదురుచూస్తున్న సంతోష్‌
అలాగే వారి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే పవిత్ర అభిమానులకు సంతోష్‌ కుమార్‌ ఇదివరకే తెలుసు. గతంలో ఇతడు స్టేజిమీద అందరి ముందే పవిత్రకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. కానీ అప్పుడు ఏ సమాధానమూ చెప్పని పవిత్ర.. తర్వాత సంతోష్‌ కుమార్‌తో కలిసి వాలంటైన్స్‌ డే సందర్భంగా ఓ  ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే యాంకర్ వారిని లవ్‌ ప్రపోజ్‌ చేసుకోవాలని కోరగా ఆమె తెగ సిగ్గుపడింది. ఎట్టకేలకు అతడితోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

చదవండి: గిన్నిస్‌ రికార్డు.. ఆయనే నా సూపర్‌ హీరో అంటున్న సుమ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు