Breaking News

హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్‌

Published on Fri, 09/01/2023 - 16:34

జబర్దస్త్ నవీన్.. బుల్లితెర‌పై, వెండితెరపై న‌వ్వుల జ‌ల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపుల‌ర్ అయ్యాడు. వ‌రుస సినిమాల‌తో, విభిన్న పాత్ర‌ల‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్‌డే నేడు (సెప్టెంబర్‌ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్‌ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.

► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను.

 

► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి  అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది.

► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను.

చదవండి: ఫోటో షేర్‌ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)