Breaking News

ఈ జబర్దస్త్‌ కమెడియన్ల జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా?

Published on Wed, 10/18/2023 - 11:56

కమెడియన్‌గా నిలదొక్కుకున్న ఎంతోమంది జీవితంలో కష్టాలను దాటుకుని ముందుకువచ్చినవారే! బుల్లితెర కమెడియన్స్‌ పృథ్వీరాజ్‌, రిషి కుమార్‌ ఈ కోవలోకే వస్తారు. ఈ చైల్డ్‌ ఆర్టిస్టులిద్దరూ జబర్దస్త్‌ షోలో నవ్వులు పూయిస్తున్నారు. అయితే తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయంటోంది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత. తాజాగా ఆమె తన కుమారులతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దేవుడు నా ఇద్దరు పిల్లల్ని మరుగుజ్జులుగా పుట్టించాడు. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్లీ వీరిలాగే పుడతారేమోనని ఆపరేషన్‌ చేసి తీయించేసుకున్నాను. మా ఆయన ఆటో డ్రైవర్‌. రోజుకు రూ.400 వస్తాయి. మా అమ్మకు యాక్సిడెంట్‌లో చేయి పోయింది. తనను నేనే చూసుకోవాలి. అటు ఇద్దరు పిలల్ల్ని చూసుకోవాలి. వీళ్లకు జబర్దస్త్‌ షోలో ఇచ్చే డబ్బులు రానుపోను చార్జీలకే సరిపోతున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిపోవడానికే ఏడువేల రూపాయలు అవుతాయి.

రిషికి గుండెలో హోల్‌ ఉంది.. ఆపరేషన్‌ చేయించాం. కానీ మూడు నెలలకోసారి చెకప్‌కు తీసుకెళ్లాలి. అప్పుడో రూ.10 వేలు అవుతాయి. తనకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలన్నారు. కానీ మాకున్న స్థోమతకు మంచి ఆహారాన్ని సమకూర్చలేము. నేను కూడా గతంలో జూనియర్‌ ఆర్టిస్టుగా ఐదేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారు. అయినా అందరూ హేళన చేస్తున్నారు. ఇద్దరు పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో రూ.5 లక్షల అప్పు చేశాం. వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీర్చేంత డబ్బు మా చేతిలో ఉండట్లేదు. అప్పులవాళ్లేమో తిడుతున్నారు' అంటూ ఏడ్చేసింది శ్రీలత.

చదవండి: ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే జరుగుతుంది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)