Breaking News

చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశా.. జబర్దస్త్‌ కమెడియన్‌ ఎమోషనల్‌

Published on Fri, 03/14/2025 - 16:49

'ఇల్లు కట్టి చూడు- పెళ్లి చేసి చూడు' అన్న సామెత ఊరికే రాలేదు. ఈ రెండింటిలో ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే! ఎంత మామూలుగా పూర్తి చేయాలనుకున్నా జేబు ఖాళీ అవక తప్పదు. అయితే తను కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే కూతురి పెళ్లి చేయాల్సి వచ్చిందని, అప్పుడు నానా కష్టాలు పడ్డానంటున్నాడు కమెడియన్‌ రైజింగ్‌ రాజు (Raising Raju).

చందా వసూలు చేసి..
తాజాగా ఓ షోలో రాజు మాట్లాడుతూ.. బుల్లితెర కామెడీ షోలో పాల్గొనడానికంటే ముందు నా కూతురు పెళ్లి చేశాను. చందాలు వసూలు చేసి ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది. రాకెట్‌ రాఘవ, తాగుబోతు రమేశ్‌, ధనరాజ్‌ వంటివారు చెరో రూ.5 వేలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నా కూతురి పెళ్లి చేశాను అని ఎమోషనలయ్యాడు. రైజింగ్‌ రాజు అసలు పేరు రాజమహేంద్రవరపు రాజేశ్వరరావు. స్కూల్‌లో పేరు రాయడానికి ఇబ్బందవుతోని అతడి టీచర్‌ రాజమహేంద్రవరపు రాజు అని మార్చేసింది. 

కుటుంబ విషయాలు..
తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో జన్మించాడు. తండ్రి పేరయ్య రైతు. అయితే రాజుకు తోడుగా ఇద్దరన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఏడో తరగతికే చదువు ఆపేశాడు. పెయింటింగ్‌ వంటి పనుల్లో చేరాడు. 1979లో చెన్నైకి వెళ్లి ఆఫీస్‌ బాయ్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పని చేశాడు. ప్రస్తుతం బుల్లితెర కామెడీ షోలో రాణిస్తున్నాడు.

చదవండి: 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. పేరు వచ్చినా అవకాశాలు రావడం లేదు: నటుడు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)