చెత్త అమ్ముకునేవాడిని.. 9వ తరగతిదాకే చదువుకున్నా!

Published on Sun, 11/23/2025 - 11:51

అందరికీ నవ్వులు పంచే కమెడియన్‌ జీవితాల్లో ఎంతో విషాదం దాగి ఉంటుంది. జబర్దస్త్‌ కమెడియన్‌ నరేశ్‌ (Jabardasth Naresh) జీవితమూ అంతే! ఒకప్పుడు ఎన్నో కష్టాలు చూసిన అతడు కామెడీ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు.

స్క్రాప్‌ షాప్‌
జబర్దస్త్‌ నరేశ్‌ మాట్లాడుతూ.. మాకు చిన్నప్పటినుంచి పెద్ద ఆస్తులేమీ లేవు. నాన్నకు ట్రాలీ ఆటో ఉండేది. సరిగా ఈఎమ్‌ఐ కట్టలేక ఫైనాన్స్‌ వాళ్లు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయేవారు. మాకు చిన్న దుకాణం ఉండేది. అది స్క్రాప్‌ షాప్‌.. పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలు కొనేవాళ్లం. అవి ఎక్కువ జమయ్యాక వాటిని అమ్ముకునేవాళ్లం. 

షాప్‌ అమ్ముకునే దుస్థితి
నేను కూడా ఆ షాప్‌లో కూర్చునేవాడిని. ఇంట్లో పరిస్థితులు బాగోలేక దాన్ని అమ్ముకునే దుస్థితికి చేరుకున్నాం. పైగా నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాను. ఒకరోజు ఢీ జూనియర్స్‌ ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ పరిచయమైన వ్యక్తి నన్ను జబర్దస్త్‌కు తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాను. 

సినిమాలకు షిఫ్ట్‌ అవుతా
ఆ మధ్య నేను బాగా కమర్షియల్‌.. అని ప్రచారం జరిగింది. ఇలాంటి స్నేహితుడుంటే కట్‌ చేసేయండి అని నన్ను విమర్శించారు. కానీ, నేనంత కమర్షియల్‌ కాదు. సినిమా అవకాశాలు వస్తున్నాయి.. కానీ డేట్స్‌ సరిగా సర్దుబాటు కావడం లేదు. అందుకే ఆర్థికంగా సెటిలైన తర్వాత సినిమాలకు షిఫ్ట్‌ అవుతాను అని నరేశ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: అందువల్లే అమ్మ చనిపోయింది: హేమ కన్నీటి పర్యంతం

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)