ఊర్వశి రౌతేలా నీ ఫాలోయర్లు వేస్ట్‌...!

Published on Wed, 02/26/2025 - 14:00

ఒక సినిమాకు కలెక్షన్లు రావాలంటే ఏం చేయాలి? అనగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి ఠక్కున వచ్చే సమాధానం... భీభత్సంగా ప్రమోషన్‌ చేయాలి. సోషల్‌ మీడియాలో, టీవీ షోస్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో, క్లబ్బులూ కాలేజీలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలైతే అంతగా ప్రమోట్‌ చేయాలి...

మరి అంత భారీగా ప్రమోషన్‌ చేసిన సినిమాలు ఎందుకు బాక్సాఫీస్‌ వద్ద ఢమాల్‌ అంటున్నాయ్‌? ఏ ప్రమోషన్‌ లేకుండా వచ్చిన సినిమాలు ఎందుకు కోట్లు కొల్లగొడుతున్నాయ్‌? అని అడిగితే మాత్రం సమాధానం దొరకదు. ఇటీవలే దీనిపై సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు ఒకరు చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.

(చదవండి: తేళ్లు, బొద్దింకలు తిన్నాను.. తెలుగు హీరోయిన్‌)

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ సీనియర్‌ హీరో, నటుడు జావేద్‌ జాఫ్రి(Jaaved Jaaferi ) మాట్లాడుతూ ఈ తరహా ప్రమోషన్లను ఏ మాత్రం పనికిరావంటూ తీసిపారేయడం విశేషం. రకరకాల మాధ్యమాల్లో మార్గాల్లో చేసే ప్రమోషన్లు వృధా ప్రయాసేనని ఆయన తేల్చేశాడు. స్టార్లను వెర్రిగా అభిమానిస్తారని అందరూ భావించే ఇన్‌స్టా ఫాలోయర్ల సంఖ్య సైతం కలెక్షన్లకు ఉపకరించదని స్పష్టం చేశాడు. 

ఈ సందర్భంగా దబిడి దిబిడి నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela )ను ఉదాహరణగా పేర్కొంటూ ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్ల మంది ఫాలోయర్లు కలిగి ఉన్నారని, ఆమె ఫాలోయర్లలో కోటి మంది అంటే 10 మిలియన్ల మందిని తీసుకున్నా, ఆ 1 కోటి మంది రూ. 250 సినిమా టికెట్‌ కొంటే ఆమె ప్రతీ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసేది కదా?అని ఆయన ప్రశ్నించాడు. ఇటీవల ఊర్వశి నందమూరి బాలకృష్ణతో తెలుగు చిత్రం డాకు మహారాజ్‌లో నటించింది అంతేకాక సినిమా ప్రమోషన్‌లో ఆమె చురుగ్గా పాల్గొంది కూడా. 

అయితే కేవలం ప్రమోషన్లు మాత్రమే సినిమా విజయాన్ని ఖరారు చేయవని జావేద్‌ నొక్కిచెప్పారు. ‘‘మేం కూడా సినిమాని ప్రమోట్‌ చేయడానికి కాలేజీలకు ఇంకా చాలా చోట్లకు వెళతాం. కానీ అది ఫలితాలను ఇవ్వదని చాలా సార్లు రుజువైంది’’ అని చెప్పిన ఆయన ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోషన్‌ చేయడంలో ఉత్సాహం చూపని రజనీకాంత్‌ను ఉదాహరణగా చూపించాడు. 

‘‘రజనీకాంత్‌ సాబ్‌.. అతిపెద్ద స్టార్‌. ఆయన  తన సినిమాను ఎక్కడ ప్రమోట్‌ చేస్తాడు? మరి ఆయన సినిమాలు కలెక్షన్లు ఎందుకు సాధిస్తున్నాయి?’’ అంటూ ప్రశ్నించాడు.  మంచి సినిమా అయితే కొన్ని రోజుల పాటు రన్‌ అవుతుంది.ప్రమోషన్లు ఎంత చేసినా కానీ కొన్నిసార్లు కొంతమంది స్టార్‌లకు సరైన  ఓపెనింగ్‌ కూడా లభించదు, ’’అని ఆయన చెప్పాడు.

సరే ప్రమోషన్లు వృధా ప్రయాసే అనుకుందాం. మరి కలెక్షన్లు రావాలంటే.. సరైన మార్గం ఏమిటి? అంటే ఆయన సమాధానం ట్రైలర్‌.  అవును... సినిమా అమ్ముడుపోయేలా చేసేది ట్రైలర్‌ మాత్రమే. నాకు ట్రైలర్‌ నచ్చితే నేను సినిమా చూస్తాను, అంతే తప్ప హీరో/హీరోయిన్‌లు ఏదైనా టీవీ షోకి లేదా డ్యాన్స్‌ షోకి వచ్చి హడావిడి చేసినంత మాత్రాన నేను పట్టించుకోను. సో..ట్రైలర్‌ మాత్రమే సినిమాకి కలెక్షన్లను రప్పిస్తుంది ’’అని అంటూ జావేద్‌ జాఫ్రి చెప్పాడు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)