Breaking News

'జాట్‌' తెలుగు వర్షన్‌కు ఇబ్బంది ఏంటి..?

Published on Sun, 04/06/2025 - 08:31

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సన్నీ డియోల్‌, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా 'జాట్‌'. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.   ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భారీ మాస్‌ యాక్షన్‌ సీన్స్‌ కనిపించడంతో వారికి కొత్తగా జాట్‌ సినిమా కనిపిస్తోంది. తమన్‌ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్‌ అవుతుంది. రీసెంట్‌గా ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక స్పెషల్‌ సాంగ్‌ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశారు.

2023లో వీరసింహారెడ్డి చిత్రం తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాట్‌' కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా తెలుగులో విడుదల కావడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. తెలుగు వర్షన్‌ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా టాలీవుడ్‌లో ఈ మూవీ విడుదల కాకపోవచ్చని సమాచారం. అయితే, పాన్‌ ఇండియా రేంజ్‌లో ఒకేసారి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఏప్రిల్‌ 10లోపు పనులు పూర్తి కాకుంటే తెలుగు వర్షన్‌ మరో వారం ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

టాలీవుడ్‌కు సన్నీ డియోల్‌ ఫిదా
జాట్‌ సినిమాలో రణదీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాని లార్జర్‌ దేన్‌ లైఫ్‌ యాక్షన్‌ డ్రామాగా భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించారు. జాట్‌ సినిమాకు దర్శకుడు, నిర్మాత తెలుగు వారే కావడం విశేషం. అయితే, బాలీవుడ్‌ నిర్మాతలు టాలీవుడ్‌ వాళ్లని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సన్నీ డియోల్‌ తాజాగా అన్నారు. టాలీవుడ్‌ వాళ్లతో కలిసి వర్క్‌ చేయడం తనకు నచ్చిందని ఆయన ప్రశంసించారు. సౌత్‌ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన ఆశించారు. భవిష్యత్‌లో సౌత్‌ పరిశ్రమలో స్థిరపడాలని ఉంది అని సన్నీ డియోల్‌ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)