నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్‌ హీరోయిన్‌

Published on Wed, 07/30/2025 - 08:33

బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఇషా కోపికర్‌ తెలుగులో చంద్రలేఖ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి ఆశ్చర్యపరిచేలా పలు వ్యాఖ్చలు చేసింది. 1998లో వారిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమా ఒక సంచలనం. ఇందులో లేఖ పాత్రలో ఇష కొప్పికర్ నటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటనను తాజాగా ఆమె పంచుకుంది.

'నాగార్జున గురించి ఈ విషయం చెబితే ఆయన అభిమానులు ఎవరూ నమ్మరు. చంద్రలేఖ సినిమా షూటింగ్‌ సమయంలో నన్ను నాగార్జున చాలాసార్లు చెంపదెబ్బ కొట్టాడు. తెలుగులో ఈ సినిమా రెండోది. ఇందులో నన్ను నాగార్జున కొట్టే సీన్‌ ఒకటుంది. కానీ, ఆయన నా చెంప మీద మెల్లిగా కొట్టడంతో ఆ సీన్‌ సరిగ్గా రాలేదు. షూటింగ్‌ సమయంలో సీన్‌ కరెక్ట్‌గా రాకపోతే నాకు నచ్చదు. దీంతో నిజంగానే బలంగా కొట్టమని నేనే నాగార్జునను కోరాను. అందుకు ఆయన ఒప్పుకోలేదు. బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితిలో కొట్టాడు. అయితే, ఆ సీన్‌కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయాను. అవుట్‌పుట్‌ సరిగ్గా రాలేదు. సీన్‌ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో పలుమార్లు రీటేక్‌ తీసుకున్నాం. దీంతో నన్ను 14 సార్లు నాగార్జున చెంపదెబ్బ కొట్టారు.' అని ఆమె నవ్వుతూ చెప్పింది.

'చెంపదెబ్బలు తిన్న తర్వాత నా మొఖం వాచిపోయింది. ఆయన చేతి గుర్తులు నా మొఖంపై చాలా సమయం పాటు ఉండిపోయాయి. ఆ సమయంలో నాగార్జున కూడా చాలా బాధపడ్డారు. వెంటనే వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. నేను వద్దని వారించాను. సీన్‌ కోసం నేను డిమాండ్‌ చేయడం వల్లనే కదా అలా చేశావ్‌..' అని ఆమె గుర్తుచేసుకుంది.

చంద్రలేఖ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు. ఇషా కోపికర్‌ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్స్‌ వచ్చాయి. ఏకంగా 80కి పైగా చిత్రాల్లో నటించింది. చివరిగా అయలాన్‌లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బీజేపీలో క్రియాశీలంగా ఆమె ఉంది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)