Breaking News

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’.. కలెక్షన్స్‌ ఎంతంటే..?

Published on Sat, 08/29/2026 - 16:55

చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో.. వరుస పరాజయాల తర్వాత ఓ విజయం పలకరించడం కూడా అంతే సహజమని మరోసారి నిరూపించాడు మాస్‌ మహారాజా రవితేజ. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకు ఎట్టకేలకు ‘ఇరుముడి’తో  హిట్‌ దొరికింది. అది కూడా మాములు హిట్‌ కాదు.. బ్లాక్‌ బస్టర్‌.సినిమా రిలీజై వారం రోజులు గడిచినా ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్స్‌కి పోటెత్తున్నారు. దీంతో కలెక్షన్స్‌ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్‌ అయిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇక ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

అప్పుడెప్పుడో రూ. 100 కోట్లు.. 
రవితేజ ఖాతాలో రూ. 100 కోట్ల వసూళ్ల సినిమా పడి చాలా కాలమైంది. 2022లో వచ్చిన ధమాకా ఒక్కటే సెంచరీ కొట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. ఈ నాలుగేళ్లలో ఆయన 6 సినిమాలు చేస్తే.. వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్‌ టాక్‌ని సంపాదించుకోలేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇరుముడితో హిట్‌ కొట్టి.. పాత లెక్కలన్నీ సరిచేశాడు. మరి ఇకపై ఈ మాస్‌ మహారాజ సినీ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. 

Videos

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)