Breaking News

‘ఈగల్‌’లో మ్యూజిక్‌ కూడా కథ చెబుతుంది

Published on Fri, 02/02/2024 - 06:20

రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ డేవ్‌ జాంద్‌ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్‌ జర్నీ స్టార్ట్‌ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్‌కి మ్యూజిక్‌ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్‌’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్‌మేట్స్‌. అలా కార్తీక్‌ నాకు పరిచయం అయ్యాడు.

ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్‌ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నాకు చాన్స్‌ ఇస్తానన్నాడు కార్తీక్‌. రవితేజగారు నా మ్యూజిక్‌ ట్రాక్స్‌ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్‌ చేయడం నా లక్‌. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్‌ఆర్‌లకు మంచి స్కోప్‌ ఉంది. మ్యూజిక్‌ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్‌ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్‌లోని ఓ మూవీకి మ్యూజిక్‌ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్‌ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)