Breaking News

పదేపదే అలా చెప్పడం నాకు నచ్చదు : ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 03/08/2026 - 15:37

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవంపై స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని, ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళల గౌరవంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.

 దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలని అన్నారు. ‘నా ఇద్దరు కొడుకులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను’ అని ఆయన పేర్కొన్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయడం పట్ల నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘డ్రాగన్‌’ లుక్‌ వైరల్‌
కాగా, ఎన్టీఆర్‌ బెంగళూరుకు వస్తున్నాడని తెలిసి.. స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.వారిని అభివాదం చేయడానికి ఎన్టీఆర్‌ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్‌ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు.ప్రశాంత్‌ నీల్‌తో చేయబోతున్న డ్రాగాన్‌(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసమే ఎన్టీఆర్‌ ఈ లుక్‌లోకి మారాడు. ఇన్నాళ్లు తన లుక్‌ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్న తారక్‌..ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)