Breaking News

చిరంజీవి కూడా తన డ్యాన్స్‌లు కాపీ కొట్టాడు.. ఆ పాప్‌ కింగ్‌ ఓ హిస్టరీ!

Published on Fri, 02/27/2026 - 08:43

‘‘గోళీమార్‌...మార్‌ మార్‌ మార్‌...’’ అంటూ దొంగ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి  తన డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు అని గుర్తు చేయడం ఇప్పుడు అవసరం. ఎందుకంటే.. ఆ పాటలో చిరు డ్యాన్స్‌కు స్ఫూర్తి ని అందించిన మరో డ్యాన్సర్‌ జీవితం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది కాబట్టి. ఓ మూడున్నర దశాబ్ధాల క్రితం మైఖేల్‌ జాక్సన్‌ అనే పేరు వింటేనే కుర్రకారు వేర్రెత్తినట్టు ఊగిపోయేవారు. కాళ్లలో ఎముకలున్నాయా లేవా అన్నంత చాకచక్యంగా నృత్యాలు చేసిన మైఖేల్‌ జాక్సన్‌ సృష్టించిన రికార్డ్స్, సాధించిన సక్సెస్‌లు సాధారణమైనవి కావు. 2009లో 50ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన అమెరికా వాసి మైఖేల్‌ ఎన్ని గొప్ప విజయాలు సాధించాడో అన్ని వివాదాలకూ కేంద్రబిందువయ్యాడు.

కొత్తగా చర్మాన్ని పునఃసృష్టించుకున్నాడు అనే దగ్గర నుంచి చిన్నారులపై లైంగిక అకృత్యాలకు పాల్పడ్డాడు దాకా మైఖేల్‌ను చుట్టుముట్టిన తీవ్రమైన వివాదాలు బహుశా ప్రపంచంలోనే ఏ సెలబ్రిటీ కూడా ఎదుర్కుని ఉండడు అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి మైఖేల్‌ జీవితం ఇప్పుడు తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా ప్రపంచ ప్రేక్షకులకు మైఖేల్‌ జీవితం కళ్లకు కట్టనుంది. అనేక అడ్డంకులను దాటుకున్న  తర్వాత మైఖేల్‌ పేరిట ఈ చిత్రం  వచ్చే ఏప్రిల్‌ 24న థియేటర్లలో , ఐమ్యాక్స్‌ తెరపై విడుదల కానుంది,  జాక్సన్‌ మేనల్లుడు జాఫర్‌ జాక్సన్‌ పాప్‌ మ్యూజిక్‌ ఐకాన్ గా ప్రధాన పాత్రలో నటించడం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు.  లయన్స్ గేట్‌ ఈ చిత్రాన్ని దేశీయంగా పంపిణీ చేస్తుండగా, యూనివర్సల్‌ ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ను నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో  మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ గురించి చిత్ర దర్శకుడు ఆంటోయిన్‌ ఫుక్వా తన ఆలోచనల్ని  పంచుకున్నారు.

‘‘ మైఖేల్‌ లాంటి వ్యక్తి జీవితం గురించి సినిమా తీయడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం, ఒక నల్లజాతి కళాకారుడిగా మాత్రమే తనను పరిగణించడాన్ని అతను ఎలా నిరాకరించాడో చూశాను.  దర్శకుడిగా నా కెరీర్‌పై మైఖేల్‌ పెనుప్రభావాన్ని చూపాడు. ’’ అని లయన్స్ గేట్‌ విడుదల చేసిన ఓ వీడియోలో ఫుక్వా  చెప్పారు. ‘‘మైఖేల్‌ జీవితమంతా ప్రజలకు తన స్వరం ద్వారా ఆనందాన్ని పంచాడు.   అందుకే అతను  తన జీవితం కంటే ఎంతో ఉన్నతుడు . అంత ఉన్నతమైన జీవితాన్ని  సినిమాటిక్‌ మార్గంలో చూపడం నాకు అంత సులభం కాలేదు.’’ అన్నారాయన. ‘‘తనతో పాటు వెనక్కి తిరిగి వెళ్లి కొంచెం దూరం ప్రయాణం చేయకపోతే  ఓ మనిషిగా మైఖేల్‌ జాక్సన్ ను ఎవరైనా అర్థం చేసుకోగలరని  అనుకోను. అతను తన కుటుంబం పట్ల తనకున్న ప్రేమకు  సంగీతం పట్ల తనకున్న ప్రేమకు మధ్య పోరాడాడు.’’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు పుక్వా.

సంగీత ప్రయాణం కోసం తన కుటుంబాన్ని జాక్సన్ విడిచిపెట్టడంతో మొదలై 1979 లో జాక్సన్‌ తన మొదటి సోలో ఆల్బమ్‌  ఆఫ్‌ ది వాల్‌ విడుదల చేయడంతో తొలి చిత్రం ముగుస్తుందని హాలీవుడ్‌ రిపోర్టర్‌ అంచనా. ఆ తర్వాత  జాక్సన్‌ 2009 మరణానికి ముందు అతని మిగిలిన కెరీర్‌  ఇతరత్రా సంఘటనలపై రెండవ చిత్రం రానుందని కూడా తెలుస్తోంది.

ఈ మైఖేల్‌ చిత్రం తాజా ట్రైలర్‌ను ఈ నెల ప్రారంభంలో  విడుదల చేశారు.  జాక్సన్‌  తండ్రి జో జాక్సన్  పాత్రలో మైఖేల్‌ కోల్మన్‌ డొమింగో, అతని తల్లి కేథరీన్ గా నియా లాంగ్‌ నటించారు. తారాగణంలో మైల్స్‌ టెల్లర్, లారా హారియర్, కాట్‌ గ్రాహం, లారెంజ్‌ టేట్,  డెరెక్‌ లూక్‌ ఉన్నారు. గ్రాహం కింగ్, జాన్‌ బ్రాంకా  జాన్‌ మెక్‌క్లైన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు, దీనికి జాన్‌ లోగన్‌ స్క్రిప్ట్‌ అందించారు.
 

Videos

విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య

మొదటి సారి సీఎం అయినప్పుడు అసెంబ్లీలో ఎవ్వరికి తెలియని పచ్చి నిజం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

పెళ్లి సీజన్‌లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు

లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్ చిట్ కన్నీళ్లు పెట్టుకున్న కేజీవాల్

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ

చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు

అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్

కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Mangalagiri : జనసేన ఆఫీస్ లో దాడి.. కారు అద్దాలు ధ్వంసం

Photos

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)

+5

పిల్లాడే కాదు, మేమూ మిస్‌ అవుతాం: కాజల్‌ (ఫోటోలు)

+5

బ్లాక్‌ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

నాని 'ది ప్యారడైజ్' HD మూవీ స్టిల్స్‌

+5

ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే (ఫొటోలు)

+5

ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఇదిగో విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు

+5

ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)

+5

థాయ్‌ల్యాండ్‌ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)