Breaking News

‘కట్టప్ప’ సత్యరాజ్‌ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Published on Wed, 02/22/2023 - 13:45

నటుడు సత్యరాజ్‌ గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. బాహుబలి చిత్రంతో కట్టప్పగా దేశ్యవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. తమిళ నటుడైన అయన ఎన్నో తెలుగు చిత్రాల్లో తండ్రి పాత్రలతో చేసి మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక బాహుబలితో కట్టప్పగా నేషనల్‌ స్టార్‌గా మారారు. అంత స్టార్‌ హోదా పొందిన ఆయన మీడియాకు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు.

అందుకే సత్యరాజ్‌ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయనకు భార్య మహేశ్వరి, ఓ కొడుకు, కూతురు ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పటికే ఆయన కుమారుడు సిబిరాజ్‌ సినీరంగ ప్రవేశం చేశాడు. డోరా, మాయోన్‌ వంటి చిత్రాల్లో నటించిన మెప్పించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్‌. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గ్లామర్‌ ప్రపంచానికి దూరంగా ఉంటున్న దివ్య న్యూట్రిషియన్‌గా కెరీర్‌ కొనసాగిస్తుంది. స్టార్‌ నటుడి కూతురిగా మీడియా కంటపడకుండా పర్సనల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్న ఆమె సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. 

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తరచూ నెటిజన్లకు ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతో ఆమెకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు బయటకు రావడంతో హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం అంటూ సినీ ప్రియులు కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. అయితే తండ్రి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చే ఆలోచన ఉందా? అనే ప్రశ్నలు తనకు తరచూ ఎదురవుతుంటాయట. దివ్య మాత్రం తన ప్రొఫెషన్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని, సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ సమాధానం ఇస్తుందని సన్నిహితుల నుంచి సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)