Breaking News

Ekta Kapoor: 17 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. ముచ్చటగా మూడు దశాబ్దాలు

Published on Wed, 07/30/2025 - 18:38

వినోద పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఏక్తా కపూర్‌. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. తనను తాను తీర్చిదిద్దుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో కెరీర్‌ ప్రారంభించిన ఏక్తా కపూర్‌ హిందీలో ఎన్నో టీవీ సోప్‌ ఒపెరాలను నిర్మించింది. ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’ ‘కహాని ఘర్‌ ఘర్‌ కీ’... వంటివి వాటిలో బాగా పాపులర్‌ అయ్యాయి.

‘బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై నిర్మాతగా ‘ది డర్టీ పిక్చర్‌’ ‘డ్రీమ్‌ గర్ల్‌’ ‘క్రూ’లాంటి సినిమాలు నిర్మించింది. 2017లో వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఆల్ట్‌ బాలాజీ’ప్రారంభించింది.

ఏక్తా కపూర్‌ది నల్లేరు మీద నడకేమీ కాదు. మొదట్లో కొన్ని ప్రాజెక్ట్‌లు ఫెయిల్‌ అయ్యాయి. ఆరు పైలట్‌ ఎపిసోడ్‌లు రిజెక్ట్‌ అయ్యాయి.

‘హమ్‌ పాంచ్‌’ టీవీ సిరీస్‌ రూపంలో తొలి సక్సెస్‌ వచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంగ్ల ఆక్షరం ‘కె’ను లక్కీ ఆల్ఫాబెట్‌గా భావించే ఏక్తా ‘కె’తో ప్రారంభమయ్యే టైటిల్‌తో ఎన్నో షోలు నిర్మించింది. ఏక్తాకపూర్‌ అదృష్టాన్ని నమ్ముకుందా, తన కష్టాన్ని నమ్ముకుందా అనే విషయానికి వస్తే... ఒక ప్రసిద్ధ మాటను గుర్తు తెచ్చుకోవడం అవసరం.‘కష్టపడేవారినే అదృష్టం ఇష్టపడుతుంది’‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది సోప్‌ క్వీన్‌: దీ స్టోరీ ఆఫ్‌ బాలజీ టెలిఫిల్మ్‌’ పేరుతో ఏక్తా కపూర్‌ బయోగ్రఫీ వచ్చింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)