Breaking News

దర్శకుడి ఆలోచనని దృశ్యరూపం అందించడమే లక్ష్యం

Published on Thu, 01/30/2025 - 18:32

ఒక మనిషి ఆలోచనతో మొదలై ఎన్నో అద్భుతాలును సృష్టించేదే సినిమా. మహాసముద్రం లాంటి ఈ సినీ ప్రపంచంలో వైవిధ్యమయిన కథ కథనాలతో ప్రేక్షకుల మనసును మెప్పించడానికి దర్శకుల ప్రతిభతో పాటు ప్రతి సన్నివేషాన్ని కథకు అనుగుణంగా ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేలా  చిత్రీకరించటంలో సినిమాటోగ్రఫర్ పాత్ర చాల ప్రధానమైనది. ప్రతి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా తనకంటూ వున్న శైలితో నవతరాన్ని ఆకట్టుకుంటున్న నేటితరం  సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి( Kushendar Ramesh Reddy).

హైదరాబాద్ లో పుట్టిపెరిగిన మన తెలుగోడే ఈ కుశేందర్ రమేష్ రెడ్డి. చిన్నతనం నుంచే  ఫోటోగ్రఫీ పట్ల గొప్ప ఆసక్తి కలిగిన కుశేందర్ ఇప్పుడు బారీ సినిమాలకు డిఓపి గా  పని చేస్తూ అటు ప్రేక్షకుల  ఇటు విశ్లేషకుల మన్ననలు పొందుతున్నారు. స్కూల్ డేస్ నుండి తనకి ఫోటోగ్రఫీ పైన ఆసక్తి !ఒక కెమెరా కొనుక్కునేలా చేసింది, తన కెమెరాలో బంధించిన ఫోటోలకు  పలువురి  ప్రశంసలు కురిపించేలా  చేసింది. ఆ ఆసక్తితో చిన్న కెమెరా పట్టుకున్న చేతులు  ఇష్టంతో పెద్ద కెమెరా పట్టుకునే స్థాయికి వెళ్లి ఫోటోగ్రఫీ తన ప్రొఫెషన్ గా మార్చుకున్నారు. కేకే సెంథిల్‌ దగ్గర 'ఈగ' ,'బాహుబలి 1','బాహుబలి 2'  అలాగే 'ఆర్‌ఆర్‌ఆర్‌' కి  చీఫ్ అసోసియేట్ గా  పనిచేస్తూ  అంచెలంచెలుగా  తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటూ సెకండ్ కెమెరాకి ఆపరేటర్ గా  కూడా పనిచేసే స్థాయికి ఎదిగి  భారీ  సినిమాల నిర్మాణంలో  భాగమయ్యారు.

ఆ తర్వాత ఇండిపెండెంట్ గా ఒక భారీ  టీవీ సిరీస్ తో పాటు ఆడ్ ఫిలిమ్స్ కూడా చేశారు . 2022 లో కీరవాణి గారి అబ్బాయి శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన 'బాగ్ సాలే' మూవీతో తన కెరీర్ ని మొదలుపెట్టి ,రీసెంట్ గ వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' తో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

చరిత్ర చీకటిలో కప్పబడిన ఒక కన్నీటి గాధని 'రజాకార్'(Razakar) సినిమా గా మలిచిన దర్శకుడు యాటా గారి  ఆలోచనని  దృశ్యకావ్యంగా  మలిచే క్రమంలో ప్రతి సన్నివేశం మన కళ్ళముందే జరుగుతున్నట్టుగా, అప్పటి చరిత్ర ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా తన సినిమాటోగ్రఫీతో అందరి కళ్ళు చెమర్చేలా తన  విజువల్స్ మాట్లాడుతున్నాయని ప్రేక్షకులు చెప్పుకునే స్థాయికి  ఎదిగారు.

ప్రస్తుతం  గ్లిమ్ప్స్ మరియు టీజర్ తో   మంచి బజ్ అందుకున్న వానర సెల్యూలాయిడ్ , డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో వస్తున్న 'బార్బరిక్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాధ్ కథ కథనంతో నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా పొలిమేర ఫెమ్  కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా SSS ప్రొడక్షన్ హౌస్ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రానికి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్యం లేకుండా కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుని   తనదైన ప్రత్యేక శైలితో దర్శకుల ఆలోచలనలకి దృశ్యరూపం అందించాలని, తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని ఉందని మీడియాతో  చెప్పుకొచ్చారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)