Breaking News

అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్‌.. శ్రీయ భూపాల్‌ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?

Published on Sat, 06/14/2025 - 10:39

పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు  సామాన్యులకు ఎప్పుడూ  వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్‌ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్‌... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్‌... ఇంకా కెరీర్‌ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. 

అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్‌ రూపుదిద్దుకోకుండానే అఖిల్‌ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్‌ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం.  అంటే అక్కినేని యంగ్‌ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్‌ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.

మరోవైపు అఖిల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్‌(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్, కాస్ట్యూమ్‌ మేకర్‌.  

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ స్కూల్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్‌ డిజైనర్‌గా  శ్రియా శరణ్, సమంతా రూత్‌ ప్రభు  కాజల్‌ అగర్వాల్‌ వంటి టాప్‌ టాలీవుడ్‌ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు.  అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్‌’ అనే దుస్తుల బ్రాండ్‌ కు  వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె  లో ప్రొఫైల్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.

అఖిల్‌తో బ్రేకప్‌ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కుమారుడైన అనిందిత్‌ రెడ్డి ని  ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు.  సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్‌ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ  కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. 

హైదరాబాద్‌  నుంచి టాప్‌ క్లాస్‌ రేసింగ్‌ డ్రైవర్‌గా నిలిచాడు. గత  2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌స్పోర్ట్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సి)లో 2017లో మోటార్‌స్పోర్ట్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్‌వ్యాగన్‌ వెంటో కప్‌ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను  వరల్డ్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ఫార్మ్‌ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్‌గా ఎంపికయ్యాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)