Breaking News

Trisha: 20 ఏళ్ల కెరీర్‌.. ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే..

Published on Sun, 12/17/2023 - 11:22

వెండితెర మీద తిరుగులేని నటీనటులు కూడా వెబ్‌తెర మీద ఫోకస్‌ పెడుతున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు త్రిష కూడా చేరింది. యాక్టింగ్‌ కెరీర్‌ ముఖ్యంగా నటీమణుల విషయంలో.. వయసు మీద కాదు ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుందని గ్లామర్‌ క్వీన్‌గానూ పేరుతెచ్చుకున్న ఆమెను చూస్తే తెలుస్తుంది. మధ్యలో కాస్త గ్యాప్‌ వచ్చినా ఆమె గ్రాఫ్‌ అయితే పడిపోలేదు. తన అందం, అభినయంతో ఇటు సిల్వర్‌ స్క్రీన్‌నూ అటు వెబ్‌ స్క్రీన్‌నూ మెరిపిస్తోంది! 

► త్రిష సొంతూరు చెన్నై. బీబీఏ పూర్తి చేసింది.  క్రిమినల్‌ సైకాలజీ చదవాలనుకుంది.  పదహారేళ్ల వయసులో ‘మిస్‌ చెన్నై’ టైటిల్‌ గెలిచింది. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది. మరెన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 

► ఇరవై ఏళ్ల క్రితం ‘జోడీ’లో నటి సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఆమే ఊహించి ఉండదు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌నవుతానని! 

► ‘మౌనం పేసియదే’ తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ‘సామి’, ‘గిల్లి’ చిత్రాలు త్రిషను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెడితే, తెలుగులో చేసిన ‘వర్షం’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు ఆమె క్రేజ్‌ను పెంచాయి. 

► అందరిలాగే త్రిషకూ  కొంతకాలం కష్టంగానే సాగింది. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు ఆమెకు అచ్చి రాలేదు. కానీ మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మాత్రం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో త్రిషకు దొరికిన గోల్డెన్‌ చాన్స్‌గా చెప్పొచ్చు. అందులో యువరాణి కుందవైగా మెప్పించి తన ఫామ్‌ను నిలబెట్టుకుంది. 

►ప్రస్తుతం వరుసగా స్టార్‌ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. ఆమె తాజా చిత్రం ‘లియో’ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘ద రోడ్‌’ ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్నాయి. 

విహార యాత్రలు చేయడంలో ముందుంటా. న్యూయార్క్‌ బాగా నచ్చుతుంది. ఇప్పటికే పలు దేశాలు తిరిగొచ్చాను.  ప్రపంచం మొత్తం చుట్టిరావాలన్నదే నా కోరిక. – త్రిష 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)