Breaking News

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా?

Published on Sun, 11/19/2023 - 13:44

కుశా కపిలా... సోషల్‌ మీడియాతో స్టార్డమ్‌ తెచ్చుకున్న నటి. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్‌ చేస్తూ వచ్చిన ఫాలోయింగ్‌తో సినీ అవకాశాలను సొంతం చేసుకుంది. అలా సినిమాలతో పాటు వరుస వెబ్‌ సిరీసుల్లోనూ నటిస్తోన్న ఆమె గురించి కొన్ని విషయాలు..

కుశా కపిలా.. న్యూఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. చదువు పూర్తికాగానే.. ఫ్యాషన్‌ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం కాపీ రైటర్‌గానూ పని చేసింది. ఆ తర్వాత ‘ఐదివా’ అనే ఫ్యాషన్, లైఫ్‌ స్టైల్‌ వెబ్‌సైట్‌లో కంటెంట్‌ రైటర్‌గా చేరింది.

సోషల్‌ మీడియాలో ఢిల్లీ పంజాబీ గాసిప్‌ ఆంటీ ‘బిల్లీ మాసి’ అనే పాత్రను క్రియేట్‌ చేసి.. నటించింది. దాంతో కుశా పాపులర్‌ అవడమే కాక సోషల్‌ మీడియా సెన్సేషన్‌గానూ మారింది.

‘సన్‌ ఆఫ్‌ అబిష్‌’ అనే టీవీ షోతో బుల్లితెర ప్రవేశం చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’తో వెబ్‌ తెరపైనా మెరిసింది. అమెజాన్‌ ఒరిజినల్‌ కామెడీ షోలోనూ పార్టిసిపేట్‌ చేసింది.

‘ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి’లో కీలక పాత్ర పోషించి సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్‌ కమింగ్‌’ సినిమాల్లోనూ నటించింది. ∙ ప్రస్తుతం ‘మైనస్‌ వన్‌: న్యూ చాప్టర్‌’, ’సోషల్‌ కరెన్సీ’ వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోంది.

జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కొంటేనే మనకేం కావాలో తెలుస్తుంది. – కుశా కపిలా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)