Breaking News

నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?

Published on Wed, 08/20/2025 - 11:07

‘100% లవ్‌’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్‌ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్‌ తింటూ..‘ఎవడ్రా చికెన్‌ తింటే బ్రెయిన్‌ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్‌ అబ్బూరి.  

#90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్‌ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్‌ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్‌ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు.  టీజర్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన అనిల్‌ రావిపూడి సైతం నిఖిల్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్‌ సినిమాలో చికెన్‌ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్‌ని స్టేజ్‌పైకి పిలిచి అభినందించాడు. 

ప్రభాస్ ‘మిర్చి’, రామ్‌ ‘గణేశ్‌’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన నిఖిల్‌..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్‌ పాత్రని పోషించాడు.  ఈ చిత్రం  ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)