ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సిన సినిమా: యంగ్‌ హీరో

Published on Wed, 04/23/2025 - 17:25

కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమాలు కూడా కొత్త వారితో తీసినవే. అవి మంచి విజయాల్ని సాధించాయి. అలాగే మా ‘చౌర్య పాఠం’ సినిమా కూడా  సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. సెన్సార్ సభ్యులు సినిమాని అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అన్నారు యంగ్‌ హీరో ఇంద్ర రామ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘చౌర్య పాఠం’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు ఈ చిత్రంతో ప్రొడక్షన్స్‌లోకి అడుగుపెడుతున్నారు.కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఏప్రిల్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఇంద్ర రామ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

⇢ మాది విజయవాడ. అక్కడే చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్శిటీ ఇంజనీరింగ్ చేశాను. చదువుతో పాటు జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇంట్రస్ట్ ఇటు వైపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. నక్కిన గారు ఈ ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారని తెలిసి ఆయన్ని కలిశాను. అలా ఈ జర్నీ మొదలైయింది. ఈ సినిమాలో కథే మెయిన్ హీరో. ఈ సినిమాని హానెస్ట్ గా చేశాం. నక్కిన త్రినాథ్ గారు చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు.

⇢ ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. కథా రచయిత కార్తిక్ వాళ్ళ ఫాదర్ ఐజి గా పని చేశారు. ఇలాంటి కేసుని ఆయన టేకాఫ్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్  ఉంటే మరో వీధిలో రూమ్ ని తీసుకొని అక్కడ నుంచి టన్నల్ తవ్వి బ్యాంక్ లోకి చొరబడ్డ సంఘటన జరిగింది. దానికి ఫిక్షన్ జోడించి ఈ సినిమాని చేయడం జరిగింది.

⇢ ఈ సినిమా కోసం చాలా హోం వర్క్ చేశాం. ఇలాంటి సినిమా చేయడానికి ఎలాంటి రిఫరెన్స్ ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమాలో టన్నల్స్ క్రియేట్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక డిఫరెంట్ వరల్డ్. చాలా కష్టపడ్డాం. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో ఒక ఫిక్షనల్ విలేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది.

⇢ ఈ సినిమాకి విజయ సేతుపతి గారు, నాగచైతన్య గారు, వరుణ్ తేజ్ అన్న అందరూ సపోర్ట్ చేశారు. అలాగే సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కూడా చాలా హెల్ప్ అయ్యింది.

⇢ నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టం. సినిమా అవకాశం కోసం ఆయన దగ్గరికి వెళ్లాను. వంగవీటి సినిమా సమయంలో ఓ క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే దర్శకుడు అజయ్ భూపతితో నాకు జర్నీ వుంది. ఆర్ఎక్స్ 100 నేను చేయల్సిన సినిమా. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. కార్తికేయ అద్భుతంగా చేశాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)