Breaking News

ఇండియన్‌–3 సినిమాపై శంకర్‌ ప్రకటన

Published on Sat, 01/18/2025 - 07:02

నటుడు కమలహాసన్‌(Kamal Haasan), శంకర్‌(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇండియన్‌.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్‌–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. 

ఇకపోతే దర్శకుడు శంకర్‌ తొలిసారిగా తెలుగులో రామ్‌చరణ్‌ కథానాయకుడుగా తెరకెక్కించిన చిత్రం గేమ్‌ చేంజర్‌. బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. దీంతో దర్శకుడు శంకర్‌ మరో చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చకు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్‌–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. 

ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. మదురై ఎంపీ ఎస్‌ వెంకటేశన్‌ రాసిన రచించిన నవల ఆధారంగా కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు చెప్పారు.

బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా ఇండియన్‌-2
గత ఏడాదిలో విడుదలైన ఇండియన్‌ 2 మూవీ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్‌) వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దీంతో క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఇండియ‌న్ 2 బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తెలుగులో కూడా భార‌తీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ప‌ద‌మూడు కోట్లు మాత్రమే క‌లెక్ష‌న్స్  అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను ఎదుర్కొంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)