Breaking News

బూజు దులపనున్నారా.. తెరపైకి సీక్వెల్‌ సినిమా

Published on Fri, 07/25/2025 - 06:55

కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇండియన్‌ (భారతీయుడు). 1996లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో ఇండియన్‌– 2 చిత్రాన్ని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొంటూ దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణాన్ని జరుపుకుంది. 2024 లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కాగా దీనికి సీక్వెల్‌ను నిర్మించనున్నట్లు ఇండియన్‌– 2 చిత్ర నిర్మాణ దశలోనే పేర్కొన్నారు. అయితే ఇండియన్‌ –2 చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఇండియన్‌– 3 రావడం అసాధ్యమేనే ప్రచారం జరిగింది. 

ఆ చిత్రం గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కడం విశేషం. ఇండియన్‌ –3 చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది ఈచిత్ర షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు శంకర్‌ వర్గాలను సంప్రదించగా ఇండియన్‌ –3 చిత్ర నిర్మాణానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా ఈ చిత్రాన్ని అయినా శంకర్‌ ప్రేక్షకులను రంజంపజేసే విధంగా తెరకెక్కిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది.

 ఎందుకంటే ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం గేమ్‌ చేంజర్, తమిళ చిత్రం ఇండియన్‌– 2 పూర్తిగా నిరాశపరిచాయి. అదే విధంగా కమలహాసన్‌ కూడా ఇండియన్‌– 2, థక్‌ లైఫ్‌ చిత్రాలతో ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఈ ముగ్గురికి ఇప్పుడు హిట్‌ చాలా అవసరం కావడం గమనార్హం. అందుకే ఇండియన్‌3 ప్రాజెక్ట్‌ బూజు దులుపేందుకు సిద్ధం అవుతున్నారట.

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)