Breaking News

కాజల్‌ను ఇండియన్‌–2 సినిమానే కాపాడింది

Published on Thu, 06/22/2023 - 18:47

సౌత్ ఇండస్ట్రీలో  ఎప్పుడూ ఏదోవిధంగా వార్తల్లో ఉండడానికి ప్రయత్నించే నటీమణుల్లో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూ ఇండియన్‌ నటిగా గుర్తింపు పొందిన నటి ఈమె. తెలుగు చిత్రం మగధీరతో కాజల్‌ అగర్వాల్‌ లక్‌ మొదలైందనే చెప్పాలి. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్‌ రాలేదు. అలాంటిది మగధీర చిత్రం తరువాత స్టార్‌ హీరోయిన్‌ల లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా వరుసగా ప్రముఖ నటుల సరసన నటించే అవకాశాలను సంపాదించుకుంది.

(ఇదీ చదవండి: టాప్‌ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)

అలా అగ్రకథానాయకిగా నటిస్తుండగానే గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి 2020లో సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిపోవడంతో కాజల్‌ అగర్వాల్‌ సినీ కెరియర్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్టే అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఈమెను ఇండియన్‌–2 చిత్రం కాపాడిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటిస్తుండగానే కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇండియన్‌–2 చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది.

(ఇదీ చదవండి: Spy Trailer:యాక్షన్‌ సీన్లతో నిఖిల్‌ దుమ్ములేపాడు)

మళ్లీ షూటింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి కాజల్‌ అగర్వాల్‌ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అందుకు చాలా కసరత్తులే చేసింది. కాగా ఇండియన్‌–2 చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో మరో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. దీంతో  కాజల్‌ గ్రాఫ్‌ మళ్లీ పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు