Breaking News

గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఇలియానా.. ఇప్పుడే కాదు కానీ..

Published on Wed, 09/03/2025 - 14:36

ఇలియానా..ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. ఎన్టీఆర్‌, ప్రభాస్‌, మహేశ్‌ బాబు..ఇలా స్టార్‌ హీరోలందరితోనూ ఆమె నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే పిల్లలు పుట్టడంతో గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇలియానా రీఎంట్రీ ఇస్తే బాగుండని చాలా మంది ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఇలియానా(Ileana D'cruz). త్వరలోనే మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇస్తానని చెప్పింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తల్లిగా పూర్తి సమయాన్ని నా ఇద్దరి పిల్లలకే కేటాయిస్తున్నాను. ఇప్పుడే సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను. నటన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ దానికంటే ముందు నా పిల్లల బాగోగులు చూసుకేనే బాధ్యత నాకుంది. అందుకే కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను. అయితే అది ఎప్పుడు, ఏ సినిమా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. రీఎంట్రీ ఇచ్చే ముందు నేను మానసికంగానే కాకుండా శారీరకంగానూ కొన్ని మార్పులు చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది’ అని ఇలియానా చెప్పుకొచ్చింది. త్వరలోనే ఇలియానా వెండితెరపై మెరవనుందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

కాగా, 2006లో దేవదాస్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. చివరిగా 2018లో రవితేజతో  ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా చేసింది. 2023లో మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని..అదే ఏడాది చివరిలో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఈ ఏడాది జులైలో రెండో కొడుకు పుట్టినట్లు ఇలియానా ప్రకటించింది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)