Breaking News

కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా

Published on Sun, 10/08/2023 - 07:36

దేవదాసు మూవీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరీ సినిమాతో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం గోవాలోనే. నటిగా టాలీవుడ్‌లో దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచేసింది. ఆ చిత్రం విజయంతో తెలుగు దర్శక నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. దీంతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలా అగ్ర కథానాయకిగా ఉన్న రోజుల్లోనే తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. బాలీవుడ్‌పై ఆశతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై మనసు పారేసుకుంది. అంతే ఆమె కెరీర్‌ అక్కడితో ఖతం అయిపోయిందని చెప్పాలి. 

(ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి)

ఇక కేడీ చిత్రం ద్వారా పరిచయమైనా ఆ చిత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని విజయ్‌ సరసన నన్బన్‌ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా ఇలియానా మాత్రం మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాలు చేసినా అవి సక్సెస్‌ కాలేదు. అలా ఇలియానా కథ ముగిసిపోయింది. అయితే ఈమె ప్రేమ గురించి పలు వదంతులు ప్రచారమయ్యాయి.

కానీ ఇటీవలే చివరికి పెళ్లి కాకుండానే తల్లి కూడా అయ్యింది. ఆ తర్వాత మైకేల్‌ డోలన్‌ తన బిడ్డకు తండ్రి అని బహిరంగంగా ప్రకటించింది. ఇటీవలే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కోయ ఫినిక్స్‌ డోలన్ అని నామకరణం చేసింది. ఈ సందర్భంగా తన మాతృహృదయం గురించి ఇలియానా ట్విట్టర్‌లో పేర్కొంది. అమ్మతనాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్లు చెప్పింది.

(ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!)

రెండు నెలలే పూర్తయిన తన బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో తన గుండె వేదనతో కొట్టుకుందని ఇలియానా చెప్పింది. కన్న బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు కలిగే బాధను ఎలా భరించాలి అన్నది ఎవరు చెప్పరని తెలిపింది. ఏ మహిళ అయినా  తల్లి అయిన తర్వాతే ఈ బాధ అర్థం అవుతుందని పేర్కొంది. అయితే తన ప్రేమికుడు తాను కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పారని తన కన్నీటిని తుడిచి నవ్వించారని చెప్పింది. ఆయన తన పక్కన ఉంటే ఏది కష్టం అనిపించలేదని, ఇప్పుడు తాను తన బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని ఇలియానా చెప్పింది.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)