Breaking News

రెండోసారి గర్భం దాల్చిన ఇలియానా!

Published on Wed, 01/01/2025 - 14:55

పాత సంవత్సరం వీడ్కోలు పలకగా కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో మన జీవితాల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2024 ఎలా గడిచిందనేది పలువురూ గుర్తు చేసుకుంటున్నారు. సంతోషాలు, బాధలు, కష్టాలు, గుణపాఠాలు.. ఇలా ఎన్నో రకాల జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నారు. హీరోయిన్‌ ఇలియానా (Ileana D'Cruz) కూడా 2024 గురించి చిన్నపాటి వీడియో రిలీజ్‌ చేసింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకు తన జీవితం ఎలా ఉందనేది చూపించింది.

మరోసారి ప్రెగ్నెన్సీ
జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని చెప్పింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇది చూసిన అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మరో బుజ్జాయి రాబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇలియానా ప్రియుడు మైఖేల్‌ డోలన్‌ను పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది.  2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్‌ పూర్తి ఫొటోను షేర్‌ చేసింది.

అప్పట్లో టాప్‌ హీరోయిన్‌
సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్‌.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లో బర్ఫీ మూవీ ఛాన్స్‌ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది. ఆమె బాలీవుడ్‌లోనే సెటిలైపోయిందన్న భావనతో ఇలియానాను సౌత్‌ ఇండస్ట్రీ పట్టించుకోలేదు.

 

చదవండి: ముంబై వదిలేసి సౌత్‌కు షిఫ్ట్‌ అయిపోతా: అనురాగ్‌ కశ్యప్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)