Breaking News

అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా

Published on Tue, 04/30/2024 - 12:38

'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్‌ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.

2012లో ఇలియానాకు బాలీవుడ్‌లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్‌ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. 

ఈ వార్తతో ఇక సౌత్‌ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్‌ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)