Breaking News

ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం

Published on Wed, 05/03/2023 - 07:05

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా అన్నయ్య కొడుకు పావలర్‌ శివన్‌ (60) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఇళయరాజా అన్నయ్య పేరు పావలర్‌ వరదరాజన్‌. ఈయన గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు, నాటక రచయిత.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరంభ కాలంలో ఇళయరాజా ఎదుగుదలలో ఈయన పాత్ర ఉంది.

పావలర్‌ వరదరాజన్‌ 1973లో కన్నుమూశారు. ఈయన ఇద్దరు కొడుకులు ఒకరు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణించారు. కాగా మరో కొడుకు పావలర్‌ శివన్‌. ఈయన గిటార్‌ వాయిద్య కళాకారుడు. ఇళయారాజా సంగీత బృందంలోనే కొనసాగుతూ వచ్చారు. పావలర్‌ శివన్‌ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పని చేశారు. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి పాండిచ్చేరిలో నివసిస్తున్నారు.

కాగా మంగళవారం వేకువజామున అనూహ్యంగా గుండెపోటు కారణంగా మంచంపై నుంచి కిందకి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతికి సంగీత దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: కమల్‌, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య వినలేదు, పాపం!

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)